బెయిల్ కోసం ఆశారాం అడ్డగోలు వాదన
posted on Sep 16, 2013 @ 8:25PM
16ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేదింపులకు పాల్పడి, ప్రస్తుతం జైళు ఊచలు లెక్కపెడుతున్న ఆద్యాత్మిక గురువు ఆశారాం బాపు, బైలు కోసం రకరకాల పాట్లు పడుతున్నాడు. ఆశారాం తరుపున ఈ కేసు వాదిస్తున్న 90 ఏళ్ల సీనియర్ లాయర్ రాంజెఠ్మాలని వింత వాదనలను తెర మీదకు తీసుకువస్తున్నాడు.
ఆశారాం పై ఆరోపణలు చేసిన అమ్మాయి మానసిక పరిస్థితి సరిగా లేదన్న జెఠ్మాలాని ఆ కారణంగానే ఆ అమ్మాయి ఆశారాంపై లైంగిక దాడి ఆరోపణలు చేసిందన్నారు, తన క్లైంట్‌కు ఎలాంటి పాపం తెలియనందున ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వాదించారుర.
అయితే ఈ కేసులో బాధితురాలి తరుపున వాధిస్తున్న లాయర్ తన క్లైంట్‌కు ఆశారాం తరుపునుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు అందుకు ఆదారంగా కాల్ రికార్డింగ్స్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు ఆశారాం బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. దాంతో పాటు ఆయన రిమాండ్ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.