అద్వానికి ఆఫర్ ఇచ్చిన బిజెపి..?
posted on Sep 16, 2013 @ 8:39PM
మోడిని ప్రదాని అభ్యర్ధిగా ప్రకటించటంతో అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎల్‌కె అద్వాని ఒక్కసారిగా యు టర్న్ తీసుకున్నారు. మోడి అభివృద్దికి కెరాఫ్ అడ్రస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే నిన్నటి వరకు బెట్టు చేసిన ఈ రాజకీయ కురువృద్దుడు ఇలా ఒక్కసారిగా మారిపోవటం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడి సారధ్యంలోని బిజెపి పార్టీ విజయం సాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న పార్టీ వర్గాలు. మోడి ప్రదాని అయితే అద్వానికి కూడా ఓ అత్యున్నత పదవి అందించే ఆలోచన ఉన్నాయి బిజెపి వర్గాలు. అయితే ప్రదాని పదవికి మించిన ఆ స్థానం ఏంటా అన్నదే ఇప్పుడు అసలు చర్చ.
గతంలో ఇలాగే ప్రదాని పీఠం మీద ఆశపడి అది అందక భంగ పడిన రాజకీయ కురువృద్దుడు ప్రణబ్ ముఖర్జీ. అయితే ప్రదాని కూర్చిలో కూర్చోక పోయిన తన అనుభవంతో రాష్ట్రపతిగా అత్యున్నత స్థానంలో ఉన్నారు ప్రణబ్. ప్రస్థుత పరిణామాలు చూస్తుంటే అద్వాని ముందున్న ఆఫర్ కూడా అదేనేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఒక్కసారిగా అద్వానీ యుటర్న్ తీసుకున్నారంటున్నారు.