అపెక్స్ కౌన్సిల్ భేటీ... మూడు అంశాలపై ఏకాభిప్రాయం..
posted on Sep 21, 2016 @ 5:17PM
అపెక్స్ కౌన్సిల్ భేటీ ముగిసింది. ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ నిర్వహించగా.. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల పంపిణీ.. కొత్త ప్రాజెక్టులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉమా భారతి మాట్లాడుతూ.. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఇరు రాష్ట్రాల సీఎం ప్రజెంటేషన్లు చూశామని.. మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది.. ఇంకా రెండు అంశాలపై ఏకాభ్రిపాయం కుదరలేదని.. నివేదిక వచ్చిన తరువాత సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి అని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర, రెండు రాష్ర్టాల ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నాము.. నదీ పరీవాహక ప్రాంతాల్లో నీటి లభ్యతను కమిటీ అంచనా వేస్తుందని తెలిపారు. కమిటీ అధ్యయనం చేసిన నివేదికను ట్రైబ్యునల్ కు అందజేస్తుందని చెప్పారు. నీటి లభ్యత ఆధారంగా ట్రైబ్యునల్ సూచనల మేరకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.