నక్క...నాగలోకమూ
posted on Oct 25, 2022 @ 2:34PM
రైతే రాజు నినాదం అనాదిగా ఉన్నదే. రాష్ట్రపతి కంటే రైతే మన దేశంలో గట్టివాడనేవారు. రాజకీయా ధికారాలు లేకపోయినా రైతు దేశ ప్రజలకు దైవంతో సమానం. కానీ కాలక్రమంలో రైతును సామాన్య ఓటరు స్థాయికి దిగజార్చారన్న మాటా లేకపోలేదు. రాజ్యాధికారం చేతికి రాగానే రాజకీయ పార్టీలు, నాయకులే రైతునీ ఓటుహక్కున్న మనిషిగానే చూస్తున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతుపట్ల కాస్తంత గౌరమే ఉందనుకోవాలి. అక్కడి ప్రభుత్వాలు వారికి గౌరవమిస్తు న్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి రైతుకి స్థాయి దిగజారింది. రాజధాని నగరానికి భూము లిచ్చినా వారిని అగౌరవపరచడమే జరుగుతోంది. వారి మాటను వినడం మానేశారు. ప్రబుత్వం ఏది నిర్ణయిస్తే దాన్నే అంగీకరించాలన్న విధంగా వారిని లోబరచుకోవడానికే చూస్తున్నారు. అందుకు పెద్ద ఉదాహరణే రైతుల మహాపాద యాత్ర. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూములు తీసుకున్నారు. 2015లో ల్యాండ్ ఫూలింగ్ ద్వారా సేకరించిన భూముల్లో 2015 ఆక్టోబర్ లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతుల నుంచి సమీకరించిన భూములతో పాటుగా ప్రభుత్వ భూములు కూడా కలిపి 50వేల ఎకరాల పైబడి విస్తీర్ణంలో అమరావతి మహా నగరం నిర్మాణానికి పూనుకున్నారు. కొన్ని కార్యాలయాలను సిద్ధం చేశారు. తాత్కాలిక అవసరాల కోసం నిర్మించిన సెక్రటేరియేట్, అసెంబ్లీ భవనాలు 2017లోనే అందుబాటులోకి తీసుకొచ్చా రు. తాత్కాలిక హైకోర్టు భవనం కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలుగుదేవంప్రభుత్వం దిగిపోయి వైసీపీ సర్కార్ వచ్చింది. దీంతో 2019 డిసెంబర్ లో జగన్ ప్రభుత్వం అమరావతి విషయంలో నిర్ణయం మార్చుకున్నట్టు ప్రకటించింది. 2020 జనవరిలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి మూడు రాజధానుల వైపు అడుగులు వేసింది. వాటిపై పలు అభ్యం తరాలు, అమరావతి ప్రాంతవాసుల ఆందోళనలకు తోడు కోర్టులో కేసులు ఉండడంతో రాజ ధానుల తరలింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. భూములు ఇచ్చింది రాజధాని నిర్మాణానికి కనుక అమరావతి నే రాజధాని చేయాలన్న రైతాంగం, ప్రజల డిమాండ్ బలపడింది. పాలనాపరమైన సౌలభ్యంకోసమే మూడు రాజధానుల మాట తెరమీదకు తెచ్చామని జగన్ సర్కార్ ప్రచారం చేసుకుం టోంది. ప్రబుత్వం చెప్పే కారణాలు, వివరణల మాట ఎలా ఉన్నప్పటికీ , రైతాంగం మాత్రం ససెమిరా అంటూ పాదయాత్ర ఆరంభించింది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సైతం.. సీఆర్డీయే చట్టాన్ని సవరించే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.అయినా జగన్ సర్కార్ తన మొండి పట్టు వీడలేదు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. మూడురాజధానులపై ముందుకే సాగుతానంటోంది. రైతుల మహాపాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటోంది.
మరో వంక నోయిడా విమనాశ్రమం కోసం చుట్టుపక్కల ఆరు గ్రామాల రైతాంగంలో 76 శాతం మంది తమ భూములు ఇవ్వడానికి అంగీకరించారు. వారిని నోయిడా విమానాశ్రమం రెండో విడత పనులకు కావలసి భూమి కోసం అధికారులు, ప్రభుత్వం సంప్రదించింది. వారిని నుంచి భూమిని తీసుకు నేందుకు అన్ని ఏర్పాట్లూ చేపడుతున్నామని ప్రభత్వం ప్రకటించింది. కలెక్టర్ ఆ గ్రామాల రైతులకు అంగీకార పత్రాలనుకూడా ఇచ్చారు. ఎయిర్ పోర్టు ప్రాజెక్టు రెండో విడత పనులు చేపడితే సుమారు 7,164 కుటుంబాలపై ప్రభావం ఉంటుందని వారిలో 70 శాతం మంది అంటే 5 వేల కుటుంబాల అంగీకారం అవసరమయిందని కలెక్టర్ తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ రాజధాని వ్యవహారం కంటే చిన్నదే కావచ్చుకాని రైతాంగంతో ప్రభుత్వాలు వ్యవహరించే తీరు లో మార్పు గమనించవచ్చు. రైతాం గాన్ని అవసరం వచ్చినపుడు బతిమాలి బామాలిన జగన్ సర్కార్ తర్వాత నిర్లక్షంగా మాట్లాడి దూరం చేసుకుంది. అటు యూపీ ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఎంతో సమన్వయంతో పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతోంది. అయితే అక్కడ కూడా ప్రబుత్వం భూముల విషయమయి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ ఆ రైతులతో సంప్రదించి పరిస్థి తులు వివరించి వారి నుంచి అనుకూలత అంగీకారం సాధించగలిగారు. వారికి ఆ ర్ అండ్ ఆర్ పాలసీనీ చక్కగా వివరించారు. ఆ తర్వాత ఆయన నాయకత్వంలోనే 200 మంది రైతులు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ను కలిశారు. వారికి భూమిపై ఇచ్చే పరిహారం పెంచమన్న డిమాండ్ గురించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అంగీకరించడం గమనార్హం. చిత్రమేమంటే, ఆంధ్రా విషయానికి వస్తే, భూములు తీసుకున్న లక్ష్యం మరోలా ఉండటం. భూములను రాజధాని నిర్మాణానికి తీసుకుని అందుకు వినియోగించుకోవడం లేదు. పైగా రాజధానిని విశాఖపట్నానికి మారిస్తే చూస్తూ ఊరుకోమని రైతాంగం కూడా కరాఖండీగా చెబుతోంది. మా వద్ద నుంచి భూములు తీసుకుని ఇప్పుడు రాజధానిని మార్చే ఆలోచన చేయడం దుర్మార్గమని రైతాంగం ఉద్యమ బాట పట్టింది. మహా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. సమస్యను పరిష్కరించడంలో జగన్ విఫలమయ్యారు. తాను పట్టిన కుందేటికి.. అన్న సామెతలా తయారయి విశాఖను అభి వృద్ధి చేయాలనే తలంపుతో సీెం జగన్ మొండిపట్టుపట్టారు. అమరావతి, చుట్టుపక్కల భూములిచ్చినవారంతా రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని, దాన్నే ముందునుంచి ప్రచారం చేశామని,ఆాశించామని భీష్మించారు. ప్రబుత్వం కేవలం రాజకీయ అవసరాలకోసమే మూడు రాజధానుల మాట ఎత్తిందేగాని వాస్తవానికి అమరావతి అభివృద్ధిని ఆకాంక్షించలేదని రైతాంగం ఆగ్రహించింది. ప్రభుత్వం పొగరు దించాలనే మహాపాదయాత్ర చేపట్టి ప్రజల మద్దతు పొందింది.