Read more!

మ‌రోసారి మ‌రో వెయ్యికోట్ల  అప్పు

అప్పు ఇచ్చేవాడు ఉండాలి, తీసుకునే ధైర్య‌మూ ఉండాలేగాని తీసుకోవ‌డం జ‌గ‌న్ స‌ర్కార్‌కి  ఓ లెక్కా! రాష్ట్రంలో ఆర్ధిక ప్ర‌గ‌తి శూన్యం అన్న‌ది ఇప్ప‌టికీ పెద్ద చ‌ర్చ‌గానే ఉంది. ఆర్ధిక‌బ‌లం నిర్వీర్యం  కావ‌డంతో ఇక కాపురం అప్పుల మీదే సాగించాలి. అప్పుల అప్పారావు అని వెన‌క వెన‌క ఎంద‌రో జోకులు వేసుకుంటున్నా, పార్టీ వారు నొస‌ట చిట్లించినా, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కి ఇది త‌ప్ప‌ని స్థితి. మ‌ళ్లీ  రిజ‌ర్వు బ్యాంక్ నుంచి మ‌రో వెయ్యికోట్లు రుణ స‌మీక‌ర‌ణ చేశారు. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. దీనిప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. 

దీనిపై అధికార పార్టీ, ప్రతిక్షాల  మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా  అప్పుల  విషయంలో జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేశారు. 13 ఏళ్ల కాలపరిమితితో 7.72 శాతం వడ్డీకి ఈ సెక్యూరిటీల వేలం నిర్వహిం చారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు రుణం పొందినట్టు ఆర్బీఐ వెల్లడించింది.

సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్లలకు వేలం నిర్వహించారు. 13  ఏళ్ల కాల పరి మితితో  7.72 శాతం వడ్డీకి వేలం చేపట్టారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల రుణం పొందిం ది. దీనిపై రిజ ర్వు బ్యాంక్ అధికారిక ప్రకటన వెలువరించింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై 21 వరకు రూ.21 వేల 500 కోట్ల రుణాన్ని జగన్ ప్రభుత్వం తీసుకుంది. 

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఆరు నెలల గడ వక ముందే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ద్వారా మరోసారి భారీగా రుణం తీసుకుంది. ప్రతి మంగళవారం సెక్యూరిటీల వేలాన్ని ఆర్బీఐ నిర్వహిస్తోంది. ఈ వేలంలో ఏపీ ప్రభుత్వం పాల్గొని రూ.వెయ్యి కోట్ల అప్పు ను తీసుకుంది. ఇప్పటివరకు వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపి స్తోంది.

ఏపీలో ప్రతి ఒక్కరిపై వేలల్లో అప్పులు ఉన్నాయని అంటోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీ పీ.. అప్పటి నుంచి పథకాల పేరుతో అప్పులు చేస్తోందని మండిపడుతోంది. కార్పొరేషన్‌ నిధులను సైతం దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తోంది. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తోం ది. తాజాగా మరోమారు ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడంతో రాజకీయాలు హీటెక్కాయి. ఎందు కోసం అప్పులు చేస్తున్నారో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా జులై 21 వరకు రూ.21,500 కోట్ల రుణాన్ని పొం దింది. ఇప్పటికే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కొద్దిపాటి వెసులుబాటు మాత్రమే మిగిలి ఉంది. 6 నెలలు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ద్వారా కేంద్రం అనుమతించిన మొత్తం లో భారీగా రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణం తీసుకుంది. ఈసారి 16 ఏళ్లకు 7.74% వడ్డీతో 500 కోట్లు, 13 ఏళ్లకు 7.72 శాతం వడ్డీతో మరో రూ.500 కోట్లు అప్పు తెచ్చింది. 105 రోజుల్లోనే రూ. 31 వేల కోట్ల అప్పు సమీక రించింది. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి  ఏపీకి రూ.48 వేల కోట్ల రుణానికి అనుమతి ఉండగా.. ఇప్పటికే రూ. 31 వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది.