రాజ్యసభ ఫలితాలు...అందరూ అనుకున్నట్టే
posted on Feb 7, 2014 @ 7:25PM
రాజ్యసభ ఎన్నికల ఫలితాలు అందరూ అనుకున్నట్టే వచ్చాయి. ఎలాంటి ట్విస్ట్ లు లేవు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో ఆరుగురి ఎంపీల ఎంపిక లాంఛనప్రాయమేనని భావించారు. ఈరోజు జరిగిన ఎన్నికలో కేవీపీ రామచంద్రరావుకు 46 తొలి ప్రాధాన్యతా ఓట్లు పోలయ్యాయి. అలాగే ఎంఏ ఖాన్ కు 49, తిక్కవరపు సుబ్బరామిరెడ్డికి 46 లెక్కన వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థుల్లో గరికపాటికి 36 ఓట్లు రాగా, సీతా రామలక్ష్మికి 38 ఓట్లు వచ్చాయి. తెరాస అభ్యర్థి కె. కేశవ రావు 26 ఓట్లు వచ్చాయి. తెరాసకు 17 మంది శాసనసభ్యులు ఉండగా, తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనకు ఓటేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 248 మంది శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైకాపా, బిజెపి, సీపీఎం సభ్యులు ఓటింగ్ కు దూరంగా వున్నారు.