ఒక్క ఓటుతో విజయం
posted on Feb 10, 2021 7:54AM
ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగడంతో కొన్ని గ్రామాల్లో ఫలితం చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఒక్క ఓటుతోనే కొందరు విజయం సాధించారు. గుంటూరు జిల్లా పిడపర్తిపాలెం సర్పంచిగా కరుణశ్రీ ఎన్నికయ్యారు. ఆమె ఒకే ఒక్క ఓటుతో గెలుపొందారు. కృష్ణా జిల్లా కంకిపాడులోనూ వైసీపీ మద్దతుదారుడు బైరెడ్డి నాగరాజు ఒక్క ఓటుతో విజయం సాధించారు. ప్రత్యర్థి మొవ్వ సుబ్రహ్మణ్యంపై ఆయన గెలుపొందారు. అతిచిన్న గ్రామం కావడంతో కేవలం 203 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వీటిలో నాగరాజుకు 102, సుబ్రహ్మణ్యానికి 101 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా అదే ఫలితం వచ్చింది. దీంతో అధికారులు నాగరాజును సర్పంచ్ గా ప్రకటించారు. కంకిపాడు మండలంలోని జగన్నాదపురంలో వైసీపీ బలపరిచిన అభ్య్థర్థి పిన్నిబోయిన శ్రీనివాసరావు మూడు ఓట్ల తేడాతో గెలుపొందారు.
శ్రీకాకుళం జిల్లాలో 40 ఏళ్ల తరువాత తొలిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో కింజారపు సురేష్ 1700 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన స్వయాన అచ్చెన్నాయుడుకు అన్న కుమారుడు.