రాజధాని తరలింపుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..
posted on Nov 20, 2020 @ 5:20PM
కొద్ది కాలం క్రితం విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్న కేసుపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించిన అఫిడవిట్‌లో ప్రభుత్వానిది మతిలేని చర్య అని పేర్కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్ తీవ్రంగా తప్పు పట్టారు. దీంతో వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన అమరావతి రాజధానిని తరలించాలనే ప్రభుత్వ ఆలోచన మతిలేని చర్య కాదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే సమయంలో రాజకీయాల్లో నేరప్రవృత్తి కూడా పెరిగిపోతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు సూచించింది. నేరచరిత్ర కలిగిన వారినుంచి వ్యవస్థలను కాపాడాలని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.