వ్యక్తిగతంగా వచ్చేవారు ఏపీకి రావద్దు! సీఎం జగన్!
posted on May 5, 2020 @ 10:53AM
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏపీలో రావడానికి అనుమతిస్తున్నాం. లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిలో వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులనే అనుమతిస్తామని సిఎం. ప్రకటన చేశారు. అయితే చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు వారి వివరాలను పరిశీలించి రాష్ట్రంలోకి రావడానికి అవకాశం కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని సి.ఎం. జగన్ చెప్పారు. వ్యక్తిగతంగా వచ్చేవారికి అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి మెరుగైన వసతులు కల్పించి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్ తరువాతే వారి వారి ఇళ్లకు పంపించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోనే వున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బాబు ఎలా స్పందిస్తారని ఏపీ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.