సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. కారణం?
posted on Jun 2, 2020 @ 12:07PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా షెడ్యూల్ మారడం వల్ల జగన్ ఢిల్లీ పర్యటన వాయిదాపడినట్లు సమాచారం.
షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే, మరో రెండు మూడు గంటల్లో ఢిల్లీకి బయల్దేరాల్సి ఉండగా సడన్‌గా ఆ పర్యటన రద్దు అయ్యింది. జగన్ పర్యటన రద్దు కావటంతో అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు రద్దయ్యాయి.
షెడ్యూలు ప్రకారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఈరోజు జగన్ భేటీ అవుదామని అనుకున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై అమిత్ షాతో చర్చిద్దామని, అలాగే, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో చర్చించాలని భావించారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని జగన్ కేంద్ర మంత్రులను కలసి కోరాలని భావించారు. అయితే, చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.