రెవెన్యూ అవినీతి అంతమయ్యేదెప్పుడు?
posted on Jul 30, 2012 @ 1:45PM
అంతులేని కథ అన్న సినిమా టైటిల్‌కు తగ్గ కథాంశం ద్వారా రచయిత సినీప్రేక్షకులను మెప్పించాడు. అలానే రెవెన్యూశాఖ అవినీతిలో అందవేసిన చేయి అనిపించుకుంటోంది. ఈ శాఖలో అంతర్భాగమైన జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకూ అవినీతి కథలు అంతులేకుండా వినిపిస్తున్నాయి. విడివిడిగా ప్రతీజిల్లాలోనూ ఈ శాఖను మామూళ్లతో ప్రజలు ముంచెస్తున్నారన్నది జగమెరిగిన సత్యం.
అయినా అథికారం కేంద్రీకృతమయ్యే శాఖ కాబట్టి దీనికి ఉండే వెయిటేజీ యథాతథంగా కొనసాగుతోంది. ఓ టైటిల్‌డీడ్ కావాలన్నా, రేషన్‌కార్డులో పేరు మార్పు, చిరునామామార్పు, ఇంకా కులధృవీకరణ, నేటివిటీ సర్టిఫికేట్లు వంటి పలురకాల సేవలకు నిర్ధారిత ధరలు లేకుండా జారీ కావటం లేదు. ఎంత ఆన్‌లైన్ చేసినా తొందరంగా సేవ కావాలనుకునే వారందరూ మండల తహశిల్దార్ కార్యాలయానికి వెడుతూనే ఉన్నారు.
అందువల్ల అవసరానికి సరిపడే సొమ్ము వెచ్చించి మరీ సర్టిఫికేట్లు తీసుకువెడుతున్నారు. ప్రభుత్వానికి కీలకమైన ఈ శాఖలోని ప్రతీ ఉద్యోగి పదవీవిరమణ చేసేటప్పటికి మంచి హోదాతో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఎసిబి కనుక ప్రతీజిల్లాలోనూ దాడులు చేస్తే తహశిల్దార్ స్థాయి అథికారుల నుంచి కనీసం కోటిరూపాయలు లెక్కల్లో లేని సొమ్ము గుర్తించవచ్చని తెలుస్తోంది. దీనికి తాజా ఉదాహరణ కర్నూలు జిల్లా కల్లూరు తహశిల్దార్ అంజనాదేవి. ఈమె ఆస్తుల సోదా ఎసిబి చేపడితే కోటిరూపాయల వరకూ విలువ తేలింది. ఈమెకు చెందిన గుంటూరులోని శ్రీనగర్, ఆర్టీసీకాలనీ, ఆటోనగర్‌ల్లో కూడా ఎసిబి ఏకకాలంలో దాడులు జరిపింది. ఈ దాడుల్లో హైదరాబాద్, గుంటూరు, కర్నూలు ఎసిబి అథికారుల బృందాలు పాల్గొన్నాయి.