ఐఎఎస్ లను ఫుట్ బాల్ ఆడుకుంటున్న ఏపి పర్కార్ ..
posted on Feb 5, 2021 @ 10:31AM
అఖిల భారత సర్వీసుల్లో అగ్రస్థానంలో ఉండేది ఐఎఎస్ లే. అలాంటి టాప్ స్థాయి అధికారులను ఏపి ప్రభుత్వం ఫుట్ బాల్ ఆడుకుంటోంది. సీనియర్లు , జూనియర్లనే తేడా కూడా గమనించడంలేదు. సీనియర్లతో ఎలా పనిచేయించుకోవాలి..జూనియర్లను ఏయే పోస్టుల్లో నియమించాలన్న ఆలోచనే చేయకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఐఎఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జూనియర్లు, సీనియర్లు ఎంతెంత మంది ఉన్నారనే దానిపై ఎక్సర్ సైజ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బాధ్యతలు అప్పగించడంపై ద్రష్గి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎవరు ఏ ఏ పోస్టుల్లో ఎంత కాలం ఉంటున్నారో అర్ధం కావడం లేదు. తాజాగా టిటిడిలో జెఇవోగా పనిచేస్తున్న బసంతో కుమార్ ను అక్కడి నుంచి తప్పించి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జిఎడికి అటాచ్ చేసింది. అలాగే ప్రాధాన్యత పోస్టులో కొనసాగుతూన్న వివేక్ యాదవ్ ను అకస్మాత్తుగా అక్కడి నుంచి బదిలీ చేసి గుంటూరు కలెక్గర్ గా నియమించింది. ఇందులోను రాజకీయమేనని ఆరోపిస్తున్నారు. బదిలీలతో ఖాళీలైన పోస్టుల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదు. అస్మదీయులకే ఆయా శాఖల అదనపు బాధ్యతలు అప్పగిస్తోంది ప్రభుత్వం . సిఎం జగన్ కు పరిపాలనపై పట్టు లేక పోవడంతో సిఎంవో లోని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఐఎఎస్ లందరిపై పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనను ప్రసన్నం చేసుకుంటే చాలు సిఎంతో పనిలేదని ఐఎఎస్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న అజేయ కల్లం గతంలో ఐఎఎస్ బదిలీల బాధ్యత నిర్వర్తించేటప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తలేదని అంటున్నారు. ఇదంతా జగన్ అనుభవ రాహిత్యమే కారణమైతే.. ఆయన పాలనపై ద్రప్టి పెట్టకపోవడం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నారని ఐఎఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఓటర్ల లిస్టును సకాలంలో అందించకపోవడంతో మంచి అధికారులుగా పేరున్న పంచాయతీ శాఖ ఉన్నతాధికారులైన గోపాల క్రష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ఎస్ఈసి వద్ద అభాసు పాలయ్యారు. సిఎం జగన్ అవగాహన, అనుభవ రాహిత్యంతో ఒకే ఒక్క అధికారిపై ఆధార పడడం వల్లనే అని ఐఎఎస్ లు వాపోతున్నారు.
పోలీస్ వ్యవుస్థ మోత్తం మరో సలహాదారు సజ్జల రామక్రష్ఱా రెడ్డి చేతుల్లో ఉండడంతో ఆ వ్యవస్థ మోత్తం అస్థవ్యవస్థగా తయారైంది. డిజిపిని డమ్మీ చేసి పోలీస్ వ్యవస్థను సజ్జల గుప్పిట్లో పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది.