ఏపీ క్యాబినెట్ విస్తరణ.. లోకేష్ కు ఐటీ శాఖ?
posted on Sep 15, 2016 @ 4:07PM
ఎపీ క్యాబినెట్లో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ కు ఎప్పటి నుండో పదవి లభిస్తుందని వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఈసారి మాత్రం అది పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే దసరాకు ఏపీ మంత్రివర్గంలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్ విస్తరణలో తనయుడు లోకేష్ బాబుకి కీలక ఐటీ శాఖతో పాటు, మరికొన్ని బాధ్యతలు అప్పగించనున్నారని వినికిడి. ఇంకా కేబినెట్‌లో 20 మంది మంత్రులు ఉండగా మరో ఆరుగురికి కొత్తగా అవకాశం కల్ఫిస్తారని పొలిటికల్ సర్కిల్ టాక్.. మంత్రివర్గంలోకి కొత్త మంత్రులను తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు రావడంతో ఆశావహలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మరోవైపు వైసీపీ నుండి వచ్చిన సీనియర్ నేతలకు కూడా అవకాశం లభించనుందని అంటున్నారు. భూమన, సుజయ రంగారావు, జ్యోతుల, జలీన్ ఖాన్‌లు మంత్రి పదవులను ఆశించి పచ్చ కండువా కప్పుకున్న వారే .. అయితే వీరిలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో చూడాలి.