ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకోనున్న అజయ్ దేవగన్.. కారణం అదేనా..?
posted on Jun 15, 2016 @ 11:34AM
ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా అజయ్ దేవగన్ దంపతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పదవి నుండి అజయ్ దేవగన్ తప్పుకుంటున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి ఆయన ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండటమే కారణమంట.
ఎందుకంటే.. ఇంత వరకు అడ్వర్టయిజ్‌మెంట్ నిమిత్తం ఒక్క యాడ్ ఫిల్మ్‌ను కూడా అజయ్ దేవగణ్‌తో చిత్రీకరించలేదు.. ఏపీలో గల పర్యాటక ప్రాంతాల గురించి వివరించిన సందర్భాలు లేవట. దీనికితోడు ఈ ప్రాజెక్టు కోసం తాను ఎలాంటి డబ్బులు తీసుకోకపోయినా టాప్ ఏజెన్సీల ద్వారా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అజయ్ దేవగణ్ భావించారని, ఇందుకోసం అజయ్ - కాజోల్‌లు లింటాస్, ఒజిల్వీ వంటి సంస్థలను కూడా చూపించారని కానీ.. ఏపీ అధికారులు మాత్రం స్థానిక ఏజెన్సీతో పట్టాలెక్కించాలని భావిస్తోందట. అందుకే అజయ్ దేవగన్ అప్ సెట్ అయ్యారని బ్రాండ్ అంబాడిడర్ గా తప్పుకోవాలని చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.