అత్యవసర మందుల జాబితాలో మరో 34 డ్రగ్స్
posted on Sep 20, 2022 @ 4:12PM
అత్యవసర మందుల జాబితాలో యాంటి క్యాన్సర్ డ్రగ్స్ ను ప్రభుత్వం చేర్చింది. బెండా ముస్టీన్ ,హైడ్రో క్లోరైడ్,ఐరి నోటి కాన్ ట్రై హైడ్రేట్ ,లేనా లైడో మైడ్,వంటి మందులను ప్రభుత్వం జాబితాలో చేర్చింది. ౩4 రకాల అత్యవసర మందులను వివిధ క్యాటగరీలుగా విభజించారు.
అందులో 27 రకాల థెరఫీ కేటగిరీలు క్యాన్సర్ యాంటి బయోటిక్స్, వ్యాక్సిన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అవి అనుబాతులో కొనుగోలు చేసే విధంగా ఉండే వీలు కల్పించినట్లు ఇది క్యాన్సర్ పెరుగుదల ఆధునిక చికిత్సల మందుల ధర పెరుగుదల నేపథ్యం లో వీటిని అత్యవసర జాబితాలో చేర్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైద్య వర్గాలు స్వాగతిస్తున్నాయి.
ఇప్పటికే ౩84 రకాల మందులు ఈ అత్యవసర జాబితాలో ఉన్నాయనీ, అదనంగా మరో 26 మందులను గతంలో ఉన్న జాబితానుండి తొలగించారు. 2౦15 నాటి జాబితాను పునరుద్దరించిన ఈ మందుల ధరలను నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ ఆధారిటీ (ఎన్ఎల్ఇఎం) ధరలను నియంత్రిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.