అజ్ఞానం నుంచి అజ్ఞాతంలోకి అనిల్ కుమార్ యాదవ్!

చరిత్ర కనీవినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఇక ఓటమికి సాకులు వెతకడం మానేసింది.  చేతులెత్తేసింది. జనాలకు ముఖం చూపలేక నానా యాతనా పడుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఓళ్లూపై తెలియకుండా మాట్లాడిన వాళ్లు, అడ్డగోలుగా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవాళ్లు ఇప్పుడు  తల ఎక్కడ దాచుకోవాలో తెలియక సతమతమౌతున్నారు.

ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలుంటే వాటిలో 164 స్థానాలు తెలుగుదేశం కూటమి చేజిక్కించుకుంది. 151 స్థానాలతో గత ఎన్నికలలో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 స్ధానాలకు గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకండా మిగిలిపోయింది. ఈ నేపథ్యంనే వైసీపీ అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడిన నేతలు, విపక్ష నేతలపై ఇష్టారీతిన నోరు పారేసుకున్న నాయకులు ఇప్పుడు ఒక్కరొక్కరుగా మౌనం లోకి వెళ్లిపోయారు. కొందరైతే అజ్ణాతంలోకి  జారుకున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఒకరు.

వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.  ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని చెప్పారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ముఖం చూపలేక చాటేశారు.

 విపక్షంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధకారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనీల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కొన్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. 

Teluguone gnews banner