Read more!

పోలింగ్ ముందు కాంగ్రెస్ విభజన హడావిడి

 

 

 

ప్రపంచంలోని అన్ని రాజకీయ పార్టీలకి వుండే అతి తెలివితేటలన్నీ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టున్నాయి. తెలంగాణలో రేపు పోలింగ్ జరగబోతోంది. సోమవారం నాడే ప్రచార కార్యక్రమం ముగిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ముందు రోజు కూడా తెలంగాణలోని ఓటర్లని ప్రభావితం చేసే కుళ్ళు ఐడియాని ఆచరణలో పెట్టింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.


ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొని రాష్ట్ర విభజన ఎలా చేయాలా అనే విషయం మీద తీవ్రంగా చర్చించారు. ఈ మీటింగ్ ఎన్నికల ముందు రోజే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? అలాగే కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు.

మే 9న సమావేశమై విభజన ప్రక్రియని సమీక్షిస్తారట. అలాగే విభజనపై ఏర్పడిన 21 కమిటీల నివేదికలను మే 8న వెబ్ సైట్‌లో వుంచుతారట. హోం శాఖ నేతృత్వంలో మరో కమిటీని కూడా ఏర్పాటు చేస్తారట. ఈ శుభవార్తలన్నీ  చెప్పదలచుకుంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత చెప్పొచ్చు కదా.. పోలింగ్ ముందురోజే చెప్పడం ఎందుకో! కాంగ్రెస్ పార్టీ తెలివితేటలన్నీ ఇలాగే వుంటాయి.