భారీగా బరువు తగ్గిపోయిన అంబానీ కొడుకు
posted on Mar 20, 2016 @ 1:53PM
భారతదేశానికి కుబేర కుటుంబం అంబానీ ఫ్యామిలీ. దేశంలో అంబానీలు అడుగుపెట్టని రంగమే లేదు. డైరెక్ట్ గానో, ఇన డైరెక్ట్ గానో చాలా వాటిలో వీళ్ల భాగస్వామ్యం ఉంది. ముంబై ఇండియన్స్ మ్యాచ్ ల టైం లో మీరు అంబానీ తనయుడిని చూశారా. భారీ కాయంతో ఉన్న ఆ అంబానీ వారసుడి పేరు అనంత్ అంబానీ. చిన్నప్పటి నుంచి అతి గారాబం కారణంగా, కాస్త ఒళ్లు చేశాడు. అతని వెయిట్ గురించి కామెంట్స్ చేయవద్దని, అప్పట్లో ముఖేష్ అంబానీ మీడియాకు రిక్వెస్ట్ లు, ఆర్డర్లు కూడా పాస్ చేశాడు. లేటెస్ట్ గా ఈ అనంత్ అంబానీ 70 కేజీల బరువును తగ్గించేశాడు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో మీరే చూడండి.
అంతకు 140 కేజీలున్న వాడు కాస్తా, ఇప్పుడు 70 కేజీలకు వచ్చేశాడు. తాజాగా గుజరాత్ లోని సోమనాథ్ ఆలయానికి దర్శనానికి వచ్చిన అంబానీని చూసి, అందరూ షాకయ్యారు. ఒక అమెరికన్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలోనే, కష్టపడి తన బరువును కరిగించాడట అనంత్ అంబానీ. అనంత్ కాకుండా ముఖేష్ అంబానీకి ఆకాశ్ అంబానీ , ఇషా అంబానీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.