జగన్ పై ఆనం ఫైర్.. బుద్దుందా నీకు..!
posted on Aug 3, 2016 @ 10:19AM
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీ నిన్న రాష్ట్రమంతటా బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి స్పందించి వైసీపీపై.. పార్టీ అధినేత జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఒకపక్క ఏపీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతుంటే.. మరోపక్క చంద్రబాబు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తురన్నారు అని అన్నారు.. వైసీపీ చేపట్టిన బంద్‌లు ప్రత్యేకహోదా కోసం కాదని, జగన్ తన హోదా పెంచుకోవడానికి ఆడిన డ్రామాగా ఆయన ఆరోపించారు. ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవాలని, ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవాలని చూస్తున్నారని.. బుద్ధుందా నీకు?... అంటూ జగన్‌పై ఆనం తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర విభజనలో తెలంగాణకు 67 శాతం... ఏపీకి 33 శాతం వాటా మాత్రమే వచ్చింది..ఇప్పుడు జగన్ ఇలాంటి బంద్ లు చేయడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏంలేదు.. ఇంకా నష్టం తప్ప అని మండిపడ్డారు.