తాను పెంచుకున్న కుక్క చనిపోతుందని తెలిసి...!
posted on Jul 16, 2016 @ 12:55PM
సాధారణంగా మనం పెంచుకునే పెంపుడు జంతువులు చనిపోతున్నాయంటే ఏం చేస్తాం. మనం అయితే వాటికి నచ్చిన ఆహారాన్ని పెట్టి.. ఆ కొద్ది రోజులు ఇంకా ప్రేమగా చూసుకుంటాం. కానీ అమెరికాను చెందిన ఓ వ్యక్తి మాత్రం తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క చనిపోతుందని తెలియగానే.. దానిని విహారయాత్రకు తీసుకెళ్లి అనేక ప్రదేశాలు చూపించాడు. వివరాల ప్రకారం.. అమెరికాలోని రాబర్ట్ కగ్లర్ అనే వ్యక్తి ఎప్పటి నుండో ఒక కుక్కని పెంచుకుంటున్నాడు. దానికి బెల్లా అని పేరు కూడా పెట్టాడు. అయితే దానికి కాన్యర్ వ్యాధి సోకి.. ఆరు నెలలకంటే ఎక్కువ బతకదని వైద్యులు చెప్పడంతో.. దానితో గడిపే ఆఖరి క్షణాలు ఎప్పుడూ గుర్తుండిపోవాలని విహారయాత్రకు తీసుకెళ్లాడు. న్యూయార్క్, డెట్రాయిట్, కెంటకీ, ఓహియో ఇలా పలుప్రాంతాల్లో తిప్పాడు. అయితే దురదృష్టవుశాత్తు.. బెల్లా డాక్టర్లు చెప్పిన గడువు కంటే ముందే చనిపోయింది. ఇక బెల్లా మృతిని ఏ మాత్రం తట్టుకోలేని రాబర్ట్ కన్నీరుమున్నీరైపోతున్నాడు. బెల్లా తనకు దేవుడిచ్చిన వరమనీ, దాని మరణాన్ని తట్టుకోవడం కష్టంగా ఉందని క్లగర్ వాయిపోయాడు.