ముస్లిం యువతులపై దాడి.. ట్రంప్ వ్యాఖ్యలు పనిచేస్తున్నాయా..
posted on Aug 16, 2016 @ 4:17PM
అమెరికాలో మత విద్వేషం పెరుగుతుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ట్రంప్ మాటలు ప్రజలపై ప్రభావం చూపుతున్నట్టే కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే. ఎందుకంటే ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయండలో దిట్ట అని అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను ఎప్పుడు ప్రసంగం చేసినా ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తుండేవాడు. తాను కనుక అధ్యక్షునిగా ఎన్నికైతే ముస్లింల ప్రవేశం నిషేదిస్తానని చెప్పేవారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే ప్రజల్లో నాటుకుపోయినట్టు ఉన్నాయి..దీనికి బురఖా ధరించిన ఇద్దరు ముస్లిం తల్లీకూతుళ్ళపై దాడి జరగడమే దానికి కారణమే దీనికి నిదర్శనం. ఈ దాడిలో గాయపడిన తల్లీ కూతుళ్లు మాట్లాడుతూ.. తామిద్దరమూ బురఖా ధరించి వెళ్తూండగా వెస్ట్ రోగర్స్ పార్క్ నెయిబర్‌హుడ్ పార్క్ వద్ద తమపై ఓ మహిళ దాడి చేసిందని, దూషించిందని చెప్పారు. తమను ఐసిస్ అని తూలనాడిందని, తమపై ఉమ్మేసిందని తెలిపారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ వల్ల ఇలాంటివి జరుగుతాయన్నాయని.. డొనాల్డ్ ట్రంప్ మాటలు ముస్లిం వ్యతిరేక భావాలకు బలం చేకూర్చాయన్నారు. ఆయన చెప్పినదాన్ని జనం చేసి చూపిస్తున్నారన్నారు.