అంబటి vs జనసేన.. ట్వీట్లతోనే ఏకిపారేస్తున్నారు!
posted on Jun 30, 2023 @ 2:08PM
వైసీపీ ఈ మధ్య కాలంలో టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేయాలంటే సరిగ్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ మైంటైన్ చేస్తుంది. చంద్రబాబు, లోకేష్ లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏదైనా విమర్శిస్తే.. కొడాలి నాని లాంటి వాళ్ళు రంగంలోకి దిగి నోటికి వచ్చింది మాట్లాడి వెళ్తారు. అదే జనసేన నుండి పవన్ కళ్యాణ్ మీదకి అయితే పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కౌంటర్ల యుద్ధం మొదలు పెడతారు. ప్రతిపక్షాల నుండి ఎవరైనా వైసీపీ నేతల మీద విమర్శలు చేస్తే వాళ్ళు స్పందించకుండా.. విమర్శించిన వారి కులానికి సంబంధించిన వైసీపీ నేతలు వచ్చి విరుచుకుపడుతుంటారు. నిజానికి ఇది గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో మొదలవగా.. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇలాంటి కుల రాజకీయం పూర్తిగా ఓపెన్ అయిపొయింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో ఎక్కడిక్కడ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల యుద్ధం కురిపించారు. కురిపిస్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో వైసీపీ నుండి పవన్ పై పెద్దగా ఎదురుదాడి లేదు. ఏమనుకున్నారో ఏమో కానీ గతంలో కంటే ఈ మధ్య ఈ ఎదురు దాడి చాలా తగ్గింది. కానీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట అంబటి.. పవన్ ను రోత స్టార్.. బూతు స్టార్ అంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు. సినిమా స్టార్.. ప్యాకేజి స్టార్.. కామెడీ స్టార్.. కోతల స్టార్.. రోత స్టార్.. బూతు స్టార్.. బా..గా.. పడిపోయావు పవన్ కళ్యాణ అంటూ రాసుకొచ్చారు. దీంతో జనసైనికులు అంబటిపై మండిపడ్డారు.
తాజాగా అంబటి రాంబాబు... పవన్ కల్యాణ్ పేరులో అర్ధాన్ని తనదైన శైలిలో వివరిస్తూ "సార్థక నామధేయుడు" అని ట్వీట్ చేశారు. పవన్ + కళ్యాణ్.. పవన్ = గాలి, గాలి, గాలి.. కళ్యాణ్ = కళ్యాణాలు.. సార్థక నామధేయుడు అంటూ ట్వీట్ చేశారు. దీంతో అంబటి చేసిన ఈ ట్వీట్ కు జనసేన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి అంబటిపై గట్టి కౌంటర్ వేసింది. గతంలో అంబటి రాంబాబు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారంటూ హల్ చల్ చేసిన ఆడియో క్లిప్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన జనసేన.. దీనితో పాటు... పలువురు మహిళలతో అంబటి చాట్ చేసినట్లు ఉన్న కొన్ని వాట్సప్ చాట్ లను పోస్ట్ చేశారు. అనంతరం "సంబరాల రాంబాబు + సంజన + సుకన్య = ఆంబోతు కాంబాబు"... "సంబరాలు = వాట్సప్ రాసలీలలు.. అంబటి రాంబాబు = ఆంబోతు కాంబాబు" అని జనసేన బృందం ట్వీట్ చేసింది.
అంతేకాదు, ముక్తసరిగా మహిళల గురించి ఊహాగానాలు చేయకుండా ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించాలని మంత్రి అంబటికి చురకలంటించారు. మొత్తంగా చూస్తే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్ల ద్వారా అంబటిని తరిమి తరిమి కొడుతున్నారు. ఈ ట్వీట్ల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కూడా లేదు. అయితే జనసేన, వైసీపీ కార్యకర్తలు, నేతల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం ఒకరకంగా సాంప్రదాయ రాజకీయాలను దాటేసి జుగుప్సాకరంగా మారిపోయింది. దీంతో బయట నుండి చూసే వారికి ఇది వెగటు కలిగిస్తోంది. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో మరెన్నో సమస్యలపై దృష్టి పెట్టాల్సిన మంత్రి ఇలా బజారుకెక్కి చిల్లర యుద్ధం చేయడం మంత్రి అంబటిని మరింత దిగజారుస్తోంది. చూడాలి మరి అంబటి ఇంకెంత దిగజారే స్థాయికి వెడతారో?!