వైసీపీకి ఓటేయను.. జగన్ కి పనిచేయను...
posted on Mar 31, 2021 @ 10:54AM
ఏపీలో దళితుల హక్కులను తుంగలో తొక్కుతున్నారని. ఎసి ఎస్టీ అట్రాసిటీ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. రైతులపై దాడులు చేస్తున్నారని. వైసీపీ ప్రభుత్వం పై అమరావతి దళిత జేఏసీ మండిపడింది. ఇది ఇలా ఉండగా రైతులు వైసీపీ పార్టీ పాలనపై చాలా విరక్తిగా మాట్లాడారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్‌గా పని చేశాను. జీవితంలో బుద్ధి వచ్చింది. ఇంకోసారి వైసీపీకి ఓటు వేయను, ఆ పార్టీ కి పని చేయను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని అప్పుడు అన్నాడు. గెలిచాక ఇప్పుడు అమరావతిని నాశనం చేస్తున్నాడు.
అవకాశం అంటే ఆదరించారు గానీ.. అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు ఆనుతున్నారు ఏపీ రైతు జెఏసి. అమరావతిలోని బడుగు, బలహీన వర్గాల రైతులను అణగదొక్కడానికి వైసీపీ ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయించిందన్నారు.
రాజధాని అమరావతికి భూములిచ్చిన దళిత రైతులకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని రాజధాని దళిత జేఏసీ జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగింది. వెలగపూడి రైతు జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన దళిత రైతుల సమావేశంలో రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెంకటపాలెం, ఐనవోలు, దొండపాడు గ్రామాలకు చెందిన దళిత, బీసీ, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన అసైన్డ్ రైతులు పాల్గొన్నారు. సమావేశంలో ఐనవోలుకు చెందిన రైతు జెట్టి చిన్నా మాట్లాడుతూ వైసీపీ కి ఎప్పుడు పనిచేయనని ఓటు వేసేది లేదని తెగేసి చెప్పాడు.
మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రము లో దళితులకు హక్కు కల్పిస్తూ గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ.41ని సీఎం జగన్‌రెడ్డి రద్దు చేస్తానని చెప్పడం ఆయన నియంత్ర పాలనకు నిదర్శనమని.. అమరావతి లో అసైన్డ్ రైతుల భూములు లాక్కున్నారని ప్రచారం చేయిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో జగన్‌రెడ్డి ప్రభుత్వమే అని శ్రావణ్ కుమార్ అన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక నాశనం చేయడానికి పూనుకున్నారని. మంగళగిరి ఎమ్మెల్యే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని రాజధాని అసైన్డ్ రైతులు అడిగితేనే మాజీ సీఎం చంద్రబాబు జీఓ.41 ఇచ్చారన్నా రు. అసైన్డ్ దళిత రైతుల హక్కుల గురించి, జీఓ.41తో అసైన్డ్ రైతులకు కలిగే ప్రయోజనాల గురించి హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరిం చారు. గ్రామాల్లో దళిత రైతుల ఇళ్ల వద్దకు సీఐడీ పోలీసులు వచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలన్నారు. మిగిలిన రైతులతో సమానంగా అసైన్డ్ రైతులకు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
దళితుల భూములను అడ్డంపెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందడం జగన్ కే చెల్లుతుందని. అమరావతి లో కట్టిన పేదల టిడ్కో గృహాలు కల్పించాలని. ప్రతి దళిత రైతుకి రూ.5వేలు పింఛను హామీ అమలు చేయాలని తీర్మానాలు చేశారు. రాజధానిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరియు అధికారులు దళితుల భూములపై కుట్రలు పన్ని, వారిని మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నారని. వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఈ సమావేశం లో దళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్, జేఏసీ మహిళా అధ్యక్షురాలు సువర్ణ కమల, కంభంపాటి శిరీష, జేఏసీ సభ్యులు బేతపూడి సుధాకర్, ముళ్లమూడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.