రాజకీయాల్లోకి రాను: ఆలీ
posted on Jun 17, 2013 @ 1:06PM
ప్రముఖ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న డా. ఆలీ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈయన తన స్వస్థలం రాజమంత్రి నుండి పోటీకి తెలుగు దేశం పార్టీ నుండి బరిలోకి దిగుతున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఇన్ని రోజుల నుండి ఈ వార్తల పై స్పందించని ఆలీ తాజాగా దీని పై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తున్న మాటల్లో నిజం లేదని, తనకు రాజకీయాలంటే పెద్దగా ఆశక్తి లేదని, అయినా నాలుగు పాత్రలు చేసుకునే నాకు రాజకీయాలు ఎందుకు ? ఒకవేళ రాజకీయాల్లోకి రావాలంటే తానే స్వయంగా ప్రకటిస్తానని, తన పై పుచ్చిన వార్తలు అన్నీ పుకార్లేనని, వాటిని ఎవరూ నమ్మవద్దని అన్నారు. ఇక ఈయనకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా పవన్, బ్రహ్మానందం సత్కరించారు. అంతే కాకుండా డాక్టరేట్ వచ్చిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆలీకి ప్రత్యేక సన్మానం కూడా జరిగింది. ఆలి ని పలువురు సత్కరించి, ఆయన స్వస్థలానికి చేస్తున్న సేవలను కొనియాడారు.