60 ఏళ్ల వృద్ధుడికి ఆరేళ్ల బాలికతో వివాహం..
posted on Jul 30, 2016 @ 12:42PM
అరవైఏళ్ల ఓ వృద్ధుడు ఆరేళ్ల బాలికను పెళ్లాడాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఇలాంటి దారుణమైన ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? ఆప్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్ లో జరిగింది. వివరాల ప్రకారం.. కాబూల్ కు చెందిన ముహమ్మద్ కరీం అనే 60 ఏళ్ల వృద్ధుడు ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా వ్యవహారాల శాఖ అధిపతి మాసూమ్ అన్వారీ కరీంను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ సందర్బంగా అన్వారీ మాట్లాడుతూ.. ''ఈ మనిషి అంటే నాకు ఎంతో భయం'' అంటూ బాలిక తరచూ అంటుందని.. బాలిక షాక్ కు గురై మట్లాడలేక పోతుందని తెలిపారు. ఇంకా ఆఫ్ఘాన్ స్వతంత్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ సీమా సమార్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో పేదరికం వల్ల ఎక్కువమంది తక్కువ వయసులోనే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.