వోటేయడానికి ఆధార్ కంపల్సరీ కాదు
posted on Feb 27, 2024 @ 10:27AM
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం కంపల్సరీ. అయితే ఆధార్ కార్డు లేకుంటే ఓటు హక్కు లేదనే అపోహ ను కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డుకట్టవేసింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్‌కార్డు ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వివరణ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని, ఆధార్ లేకున్నా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఓటరు కార్డు కానీ, లేదంటే, చెల్లుబాటు అయ్యే మరేదన్నా గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్‌లో వేలాది ఆధార్‌కార్డులను పనికిరాకుండా చేస్తున్నారంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ప్రకటన చేసింది. ఆధార్ కార్డు లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోబోమని టీఎంసీ బృందానికి ఈసీ తెలిపింది.