జగన్ గూటిలోకి ఇద్దరు ప్రకాశం ఎంఎల్ఏలు ?

 

 

 

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు యువ కాంగ్రెస్ శాసనసభ్యులు జగన్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి), బి. శివ ప్రసాద రెడ్డి (దర్శి)లు జగన్ పార్టీ నేతలతో గత కొంత కాలంగా పూసుకొని తిరుగుతున్నారు.

 

వచ్చే సంక్రాంతి లోపు వీరిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతల బంధువులు ఇప్పటికే జగన్ పార్టీలో చేరారు. తన నియోజక వర్గానికి చెందిన ప్రజలు తనను జగన్ పార్టీలో చేరాలని వత్తిడి తెస్తున్నారని రవి కుమార్ అన్నారు. ఆయన అనుచరులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల రవిని హైదరాబాద్ పిలిచి మాట్లాదారు. అయినా, రవి తన మనసు మార్చుకోలేదు.

 

శివ ప్రసాద రెడ్డి గతంలో కొంత కాలం జగన్ పార్టీలో ఉన్నారు. అయితే, అవిశ్వాస తీర్మానం సమయంలో ఆయన కాంగ్రెస్ కు ఓటు వేసారు. అయితే, స్థానిక పరిస్తితుల దృష్ట్యా ఆయన జగన్ పార్టీలో చేరడం తప్పక పోవచ్చని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా, ఈ ఇద్దరు ఎంఎల్ఏ లు జగన్ పార్టీలో చేరడం తప్పనిసరి అని తెలుస్తోంది.