తొమ్మిది ఫెయిల్.. 30 ఏళ్లుగా జాబ్..
posted on Apr 5, 2021 @ 2:41PM
తొమ్మిది ఫెయిల్.. 30 ఏళ్లుగా జాబ్..
అతను తొమ్మిదో తరగతి ఫెయిల్ అయ్యాడు.. ఎలాగైన ఉద్యోగం చేయాలనుకున్నాడు. అలాగని చదువుకొని మాత్రం కాదు.. అందుకోసం పరివిధాల ఆలోచించాడు. చివరికి తన క్రిమినల్ మైండ్ కి ఒక ఆలోచన తగిలింది. అంతే ఆ ఆలోచనతో జాబ్ లో చేరాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ౩౦ ఏళ్ళు క్రితం ఉద్యోగంలో చేశాడు. ఇంతకీ ఆ క్రిమినల్ మైండ్ కి తట్టిన ఐడియా ఏంటి..? ఉద్యోగం కోసం అతను ఏం చేశాడు...? అని తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..
ఒక దేశంలో ప్రభుత్వ అంటే పడిచచ్చే వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. కొంత మంది ఉన్నత విద్య చదివి ప్రభుత్వ ఉద్యోగం చేస్తే . మరి కొంతమంది మాత్రం అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. తను ఉద్యోగం చేయడం కోసం చనిపోయిన వ్యక్తి సర్టిఫికెట్లను ఉపయోగించి 30 ఏళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు ఒక వ్యక్తి. నిందితుడు శక్తి బంధు తమ్ముడు అశోక్ కుమార్ 1977లో బీఏ చదువుతుండగా చనిపోయాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు శక్తి బందు అశోక్ పేరుతో IMPAలో ఉద్యోగం పొందాడు. ఇందుకు కొంతమంది అధికారుల సాయం తీసుకున్నాడు. నిందితుడు 30 ఏళ్లుగా అశోక్‌కుమార్ పేరుతో IMPAలో పనిచేస్తున్నాడని, అతడు కనీసం తొమ్మిదో తరగతి కూడా పాస్ కాలేదని ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. శక్తిబంధుపై IPCలోని వివిధ సెక్షన్ల కింద కేసు రాశామని పోలీసులు చెప్పారు.
గతేడాది క్రైం బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేసినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూలోని IMPA, జమ్మూ కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్, అచ్చాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అచ్చాన్ ప్రాథమిక పాఠశాలల నుంచి అశోక్ కుమార్, శక్తి బంధు స్టడీ సర్టిఫికెట్లను పోలీసులు పరిశీలించారు. అన్ని ఆధారాలతో నిందితుడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో న్యాయ విచారణ తర్వాత అతనికి తీవ్రమైన శిక్షపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ విషయం తాజాగా బయట పడింది. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలోని అచ్చాన్ గ్రామానికి చెందిన శక్తి బంధు అలియాస్ "కాకా జీ"పై... జమ్మూకాశ్మీర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. అతను ప్రస్తుతం జమ్మూలోని పానీ చాక్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. నిందితుడు కనీసం తొమ్మిదో తరగతి కూడా పాస్ కాకపోవడం విశేషం. ప్రస్తుతం కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.