పట్టాలు తప్పిన రైలు 5గురు మృతి, 50 మందికి గాయాలు
posted on Nov 15, 2013 9:06AM
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఘోటి వద్ద మంగళ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఎర్నాకుళం నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న మంగళ ఎక్స్ప్రెస్ ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన సంభవించింది. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న రూరల్ ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. రైలు ఎందుకు పట్టాలు తప్పిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది.