44వ చెస్ ఒలింపియాడ్ శుభారంభం.. భారత్‌కే విజయావకాశాలు
posted on Jul 28, 2022 @ 11:02PM
చదరంగం అనగానే దానికి పుట్టిల్లుగా మారిన చెన్నై అందరికి గుర్తుకు వస్తుందని, ప్రపంచ ప్రఖ్యాత గ్రాండ్ మాస్టర్లకు ఈ ప్రాంతం నిలయంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 44వ ప్రపంచ చెస్ ఒలింపి యాడ్‌ను ఆరంభించి ప్రసంగించారు. చెస్ ఒలింపియాడ్ టీమ్ స్పిరిట్‌ను చాటే క్రీడోత్సవమని ఆయన అభివర్ణించారు. ఈ కార్య క్రమానికి ప్రధాని తమి ళునిలా పంచకట్టు, భుజాన కండువాతో రావడం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్ర మంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తదతరులు హాజరయ్యారు. ఈ చెస్ ఒలింపియాడ్ ఆగస్టు పదో తేదీ వరకూ జరుగుతాయి. భారత్ స్టార్లు అద్భుతంగా ఆడి తప్పకుండా పతకాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నా యని చెస్ విశ్లేషకులు అంటున్నారు.
కాగా, ప్రపంచస్థాయి చెస్ ఒలింపియాడ్‌కు భారత్ ఆతిథ్యమీయడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ రష్యాపై వేటు వేయ డంలో ఈ ఆతిథ్య అవకాశం భారత్‌కు దక్కింది. మొత్తం 190 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు భారత బృందానికి చెస్ దిగ్గజం గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్లేయర్‌గా కాకుండా మెంటార్‌గా వ్యవహరించనున్నారు.
శుక్రవారం పోటీలు ఆరంభమవుతాయి. ఈ పోటీల్లో భారత్ రికార్డుస్థాయిలో ఆరు జట్లను బరిలోకి దించుతోంది. ఓపెన్ కేటగిరీలో మూడు, మహిళల విభాగంలో మూడు టీమ్‌లు . కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మెగా ఈవెంట్ ఓపెన్ కేటగిరీలో 188 జట్లు, మహిళల విభాగంలో 162 టీమ్‌లు పోటీపడనున్నాయి. ఓపెన్ కేటగిరీలో ఆడనున్న 15 మంది భారత ప్లేయర్లూ గ్రాండ్ మాస్టర్లే కావడం గమనార్హం.ఓపెన్‌లో ఫేవరెట్‌గా పరిగణిస్తున్న గ్రాండ్ మాస్టర్లు హరికృష్ణ, అర్జున్ ఇరిగేసి, విదిత్ గుజరాతి, ఎస్‌ఎల్ నారాయణ్, శశికరణ్ కృష్ణన్‌తో కూడిన భారత్-ఎ జట్టుకు రెండో సీడ్ దక్కింది. చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద ఉన్న భారత్-బి టీమ్‌కు 11వ సీడ్, భారత్-సి టీమ్‌కు 17వ సీడ్ లభించాయి.మహిళల కేటగిరీలో గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత్-ఎ జట్టు టాప్ సీడ్ దక్కించుకోగా.. భారత్-బి, భారత్-సి టీమ్‌లకు 11వ, 16వ సీడ్‌లు లభించాయి.
ఇదిలా ఉండగా, చెస్ ఒలింపియాడ్‌ను కూడా రాజకీయ వక్రబుద్ధి చూపిన పాకిస్థాన్ పై భారత్ తీవ్రంగా ఆగ్రహించింది. ఈ ఒలింపి యాడ్ నుంచి పాకిస్థాన్ తప్పుకోవడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఈవెంట్‌ను కూడా రాజ కీయం చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. చెస్ ఒలింపియాడ్ నుంచి తప్పుకుంటున్నట్టు పాకిస్థాన్ అకస్మా త్తుగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. పాకి స్థాన్ జట్టు భారత్ చేరుకున్న తర్వాత కూడా పాకిస్థాన్ ఇలాంటి ప్రకటన చేయడం అత్యంత దురదృష్ట కరమని అన్నారు. ఒలింపి యాడ్ టార్చ్ రిలే జమ్మూకశ్మీర్ మీదుగా వెళ్తుండడాన్ని సాకుగా చూపి ఈవెంట్ నుంచి పాకిస్థాన్ తప్పుకున్నట్టు ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్‌లు భారత్‌లో అంతర్గత భాగమని, అవి అలానే ఉంటాయని బాగ్చి తేల్చి చెప్పారు.