కోరిక తీర్చలేదని.. 69 ఏళ్ళ వృద్ధురాలి హత్య
posted on Apr 28, 2021 @ 11:11AM
అది ఖమ్మం జిల్లా. కారేపల్లి గ్రామం. అతని పేరు ఉపేందర్. వయసు 43 సంవత్సరాలు. కాల్చిన అడవిపందిని బస్తాలో మూటగట్టాననీ, ఊరి శివారున పడేసి వద్దామని ఉపేందర్ స్థానిక యువకుడి సాయాన్ని తీసుకున్నాడు. స్నేహితుడి ద్విచక్ర వాహనంపై వెళ్లి ఆ బస్తాని ఓ చోట పడేశారు. ఇద్దరు చెరో దారి వెళ్లిపోయారు.. అనుమానమొచ్చిన ఉపేందర్ స్నేహితుడు. కొత్త దూరం వెళ్లి మళ్ళీ తిరిగివచ్చాడు. ఆ బస్తాలో ఏముందని విప్పి చూశారు. మనిషిని పోలిన విధంగా ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కట్ చేస్తే.. బజ్యాతండా. ఆమె పేరు అజ్మీర నాజీ. వయసు 69 సంవత్సరాలు. మతిస్థిమితం తప్ఫి. . నాజీ భర్త 20ఏళ్ల క్రితం మరణించాడు. ఈమె ముగ్గురు కుమారులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ తండాలో ఉంటున్నారు. ఒక కూతురు ఉన్నారు. నాజీ కొంత మతిస్థితిమితం కోల్పోయి కుమారుల వద్ద ఉండకుండా కారేపల్లిలో రహదారుల వెంట, రైల్వేస్టేషన్, ఇతర ప్రాంతంలో తలదాచుకుంటూ తిరిగేది. కుమారులు ఇంటికి తీసుకెళ్లినా వారిని దుర్భాషలాడి మళ్లీ కారేపల్లి వస్తుండేది.
ఓపెన్ చేస్తే... అజ్మీర నాజీ పై కొన్ని రోజుల నుంచి కారేపల్లికి చెందిన ఆదెర్ల ఉపేందర్ అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని గ్రామంలో తెలిసిన వాళ్లందరికీ చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని ఉపేందర్ కక్ష పెంచుకున్నాడు. అజ్మీర పాలిట కాలయముడయ్యాడు. 26న రాత్రి సమయంలో నాజీని చీమలపాడు రహదారి వైపు బలవంతంగా తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను నరికి హతమార్ఛి.. వాటిని అక్కడే కాల్చాడు. అనంతరం మొండెం భాగాన్ని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వేట్రాక్‌పై పడేశాడు.
కట్ చేస్తే.. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైల్వే పోలీసులు, ఖమ్మం గ్రామీణ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఎస్సై సురేశ్ ఘటనా స్థలంలో పరిశీలించారు. అనుమానాలెన్నో... వృద్ధురాలిని అతి కిరాతకంగా నరికి చంపిన ఉపేందర్ ఘటనా వివరాలు చెప్పినప్పటికీ... పోలీసులు అనుమానిస్తున్నారు. తల, కాళ్లు, చేతులు నరికి కాల్చడంతో శవం గుర్తు పట్టడానికి వీల్లేేకుండా ఉండటంతో ఆమె కుమారులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లేనా? అనే రీతిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాజీ కుమారులు మాత్రం తమకు ఫిర్యాదు ఇవ్వలేదనీ, నిందితుడు చెప్పిన వివరాలతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.ఇలా వెలుగులోకి.. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంతోపాటు బజ్యాతండాకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. అన్నం సేవా సమితి ఛైర్మన్ డా.శ్రీనివాసరావు, సభ్యులు నాజీ మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు.