కారులో నలుగురు చిన్నారుల మృతి..
posted on May 8, 2021 @ 3:03PM
చిన్న పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు. మారం చేస్తుంటారు. కొన్ని సార్లు పిల్లలకు ఏదైనా కావాలి అంటే తెచ్చి పెట్టాల్సిందే.. వాళ్ళు అడిగింది చెయ్యాల్సిందే. లేదంటే వారి ఏడుపు ద్వారా తల్లి దండ్రులకు మనశాంతి ఉండదు. అలాంటి అల్లరి చేయడం వాళ్ళ కొంత మంది పిల్లలు అనర్ధాలకు దారి తీస్తుంది. తాజాగా అలా అల్లరి చేసిన నలుగురు పిల్లలు చివరికి మృత్యువాత పడ్డారు..
ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉంది. ఆ కారును చూడగానే అక్కడ ఉన్న ఐదుగురు పిల్లలు సరదాపడ్డారు. అందరూ ఆ కారులోకి వెళ్లారు.. సంతోషంగా ఆదుకున్నారు. అసలే చిన్న పిల్లలు ఒక చోటు ఉండరు. అలా అని వాళ్ళ చేతులు కూడా ఊరుకోవు.. ఆ నలుగురిలో ఎవరు ఏం చేశారో. ఏమో ఒక్కసారిగా కారు లాక్ పడింది.. దీంతో వారంతా అందులోనే ఉండిపోయారు. అందరూ ఆందోళన చెందారు. గట్టిగా అరిచారు అయినా ఎవరు వినిపించలేదు. కనీసం అటువైపు ఎవరు చూడలేదు. ఆ పిల్లలకి ఊపిరాడలేదు. వారిని గుర్తించి బయటకు తీసే సమయానికే నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ చిన్నారులు అందరూ పదేళ్లలోపు వయసున్న వారే అని వివరించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు. వారు ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. మరొక చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సింగౌలితగా గ్రామంలో చోటు చేసుకుంది.