12 రోజులు బ్యాంకులు బంద్.. వామ్మో ఇన్ని సెలవులా?
posted on Mar 31, 2021 @ 11:19AM
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఎక్కువగా సెలవులు ఉన్నాయి. ఏప్రిల్‌లో 30 రోజులు ఉంటే అందులో 12 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. అందుకు తగ్గట్టుగా కస్టమర్లు బ్యాంకు లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.
ఏప్రిల్ 1- బ్యాంకుల అకౌంటింగ్, ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 4- ఆదివారం, ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 10- రెండో శనివారం, ఏప్రిల్ 11- ఆదివారం బ్యాంకులకు సెలవు. దీంతో పాటు ఏప్రిల్ 13- ఉగాది, ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18- ఆదివారం, ఏప్రిల్ 21- శ్రీరామనవమి, ఏప్రిల్ 24- నాలుగో శనివారం, ఏప్రిల్ 25- ఆదివారం బ్యాంకులకు సెలవు.
ఇవన్నీ హైదరాబాద్ సర్కిల్‌లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సెలవులు. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.