ఢిల్లీలో తగ్గిన కాలుష్యం.. ఈసారి 9వ స్థానం..
posted on May 12, 2016 @ 5:33PM
మన దేశంలో కాలుష్యానికి మారు పేరు ఢిల్లీ అన్నట్టు ఉండేది ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం తగ్గిపోయినట్టు తెలుస్తోంది తాజా సర్వేలను బట్టి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన జాబితాలో ఢిల్లీ ఈసారి 9 వ స్థానాన్ని దక్కించుకుంది. ఒకప్పుడు టాప్ 5 లో ఉండే ఢిల్లీ ఈసారి మాత్రం కాలుష్యాన్ని తగ్గించుకొని టాప్ 9 ప్లేస్ లో నిలిచింది. సగటు పీఎం 2.5 ఇప్పుడు ఢిల్లీలో 122 మైక్రో గ్రామ్ పర్ క్యూబిక్ మీటర్‌గా ఉందని రిపోర్టు తెలిపింది. కాగా టాప్-5 జాబితాలో గ్వాలియర్, అలహాబాద్, పట్నా, రాయ్‌పూర్ నగరాలు కాలుష్యంలో ఢిల్లీని మించిపోయాయని తేలింది. ఇరాన్ లోని కాబూల్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరితమైన నగరంగా నిలిచిందని ఈ రిపోర్టు నివేదించింది.
ఇక రిపోర్ట్ లో ఢిల్లీకి 9 వ స్థానం దక్కడంపై ఢీల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. మోస్ట్ పొల్యూటెడ్ సిటీల జాబితాలో ఇక ఢిల్లీ లేదని, ఇందుకు ఢిల్లీ వాసులకు అభినందనలంటూ ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.