దావూద్ పాక్ లోనే ఉన్నాడు.. ఇదే చిరునామా..!
posted on May 12, 2016 @ 5:08PM
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ను పట్టుకోవడాని భారత ప్రభుత్వం కొన్ని ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దావూద్ ఇబ్రహీం పాక్ లో ఉన్నాడంటూ భారత్ ఎప్పటినుండో చెబుతున్న పాక్ మాత్రం ఎప్పటిలాగే అలాంటిదేం లేదని బొంకేది. అయితే ఇప్పుడు తాజాగా దావూద్ పాక్ లోనే ఉన్నాడన్న విషయం స్టింగ్ ఆపరేషన్ ద్వారా తెలిసింది. ఓ ఆంగ్ల మీడియా దావూద్ కు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా తాను పాక్ లోనే ఉన్నాడని.. అంతేకాదు తాను ఉంటున్న ఇంటి చిరునామాను సాధించింది. పాకిస్థాన్ దక్షిణ కరాచీలోని క్లిఫ్టన్ లో డీ 13, బ్లాక్ 4లో ఉంటున్నట్టు కనుగొంది. దావూద్ బంగ్లాకు సమీపంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, దావూద్ భవంతి ఉన్న విలాసవంతమైన ప్రాంతం ఫొటోను క్లిక్ మనిపించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేస్తూనే ఈ ఆధారాలను కూడా పాక్ ప్రభుత్వం తిరస్కరించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.