అసేంబ్లీ ఆవరణ లో టిఆర్ఎస్ దీక్ష
posted on Sep 7, 2013 @ 12:28PM
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ విగ్రహం వద్ద శాంతి దీక్ష చేపట్టారు. దీక్షలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీఎన్జీఓల సభకు అనుమతించి దగ్గరుండి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తెలంగాణవాదుల శాంతి ర్యాలీలకు కూడా అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు అసేంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లో తెలంగాణ న్యాయవాదులు దీక్షకు దిగారు. తెలంగాణ న్యాయవాదులంతా గన్‌పార్క్‌కు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. నిజాం కాలేజీ విద్యార్థులపై దాడి అమానుషమని, హాస్టల్ గదులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నట్లు తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్ తెలిపారు. ఇక నిజాం కళాశాల విద్యార్థుల మీద లాఠీఛార్జ్ చేసిన పోలీసుల మీద కేసులు పెడతామని, అనుమతిలేకుండా వారు లోనికి ప్రవేశించారని నిజాం కళాశాల ప్రిన్స్ పాల్ స్వామి తెలిపారు.