మావోల తలలు చాలా ఖరీదండోయ్!
posted on Jun 28, 2014 @ 10:17AM
కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల తలలకు పోలీసు అధికారులు భారీ ధరలను ప్రకటించారు. కొంతమంది మావోయిస్టుల పేర్లను ప్రకటించి, ఒక్కో పేరుకు ఒక్కో ధరను నిర్ణయించారు. ఏ మావోయిస్టును పట్టుకుంటే ఎంత పారితోషికం లభిస్తుందో ఆ లిస్టులో వివరించారు. ఆ లిస్టు ప్రకారం... కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ బుచ్చన్న (25 లక్షలు), మల్ల రాజిరెడ్డి అలియాస్ సత్తన్న (25 లక్షలు), మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి (25 లక్షలు), ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి (25 లక్షలు), పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న (25 లక్షలు), తిప్పిరి తిరుపతి అలియాస్ సుదర్శన్ (25 లక్షలు), బల్మూరి నారాయణరావు అలియాస్ వెంకన్న (25 లక్షలు), గంకిడి సత్యనారాయణ అలియాస్ విజయ్ (20 లక్షలు), కొత్త రాంచంద్రారెడ్డి అలియాస్ ఉసెండి (20 లక్షలు), జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్న ఏలేటి రామలచ్చులు అలియాస్ రాయలచ్చులు (8 లక్షలు), ఎగలోపు మల్లయ్య అలియాస్ కమలాకర్ (8 లక్షలు), 12.అనె్న సత్తయ్య అలియాస్ సుధాకర్ (5 లక్షలు), అప్పాసి నారాయణ అలియాస్ శంకర్ (5 లక్షలు), బత్తుల కాశీరాం అలియాస్ సత్యం (5 లక్షలు), బూర భాగ్య అలియాస్ అరుణ (5 లక్షలు), చీమల నర్సయ్య అలియాస్ జోగన్న (5 లక్షలు), గుండారపు ఆనందం (5 లక్షలు), కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ (5 లక్షలు), లోకే సారమ్మ అలియాస్ సుజాత (5 లక్షలు), మేకల మనోజ్ అలియాస్ వికాస్ (5 లక్షలు), పసుల గంబాలు అలియాస్ వసంత (5 లక్షలు), బెజ్జారపు కిషన్ (5 లక్షలు), సందె గంగయ్య అలియాస్ అశోక్ (5 లక్షలు), చెన్నూరి సర్వక్క అలియాస్ స్వరూప (4 లక్షలు), దత్తు ఐలయ్య (4 లక్షలు), దీకోండ శంకరయ్య అలియాస్ శేషన్న (4 లక్షలు), నెరేళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క (4 లక్షలు), దళ సభ్యులుగా ఉన్న ముదాం లక్ష్మణ్ (2 లక్షలు), దేవరకొండ సత్యనారాయణ అలియాస్ సత్తన్న (లక్ష), జువ్వాడి వెంకటేశ్వర్‌రావువ అలియాస్ ధర్మన్న (లక్ష), కనగర్తి రజనీకర్‌రెడ్డి (లక్ష), కాశబోయిన స్వరూప (లక్ష).