తెలుగువారి మీద పంచభూతాల పగ?!
posted on Jun 28, 2014 @ 10:04AM
ప్రస్తుతం తెలుగువారి మీద పంచభూతాలు పగబట్టాయా అనే సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న వారు తెలుగువారి మీద పంచభూతాలు పగబట్టినట్టుగా వుందని భావిస్తున్నారు. పంచభూతాలలోని నీటిని తీసుకుంటే.. అకస్మాత్తుగా ప్రవహించిన నీటి వలన హిమాచల్ ప్రదేశ్‌లో 24 మంది తెలుగువారు మరణించారు. అలాగే నిప్పు తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంతో భారీ పేలుదు, అగ్ని కీలలు సంభవించి తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో 16 మంది మరణించారు. అలాగే వడగాడ్పుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వందలాది మంది రాలిపోయారు. ఇది వాయువు ఆగ్రహం కారణంగా జరిగిందని భావిస్తున్నారు. ఎల్‌నినో అనే విపత్తు ఆకాశం ఆగ్రహించడం వల్లనే వచ్చిందని అంటున్నారు. ఆకాశం ఆగ్రహించడం వల్లనే సకాలంలో వర్షాలు కురవడం లేదని భావిస్తున్నారు. ఇక ఐదో పంచ భూతమైన భూమి తన ఆగ్రహాన్ని ఏ రూపంలో ప్రదర్శిస్తుందో అని భయపడుతున్నారు.