పుదుచ్చేరి లో గ్యాంగ్ రేప్
posted on Jan 4, 2013 @ 11:13AM
ఢిల్లీ లో గ్యాంగ్ రేప్ కు గురి అయి, ఆ తర్వాత గాయాలతో మరణించిన యువతి ఘటన జరిగి కొద్ది రోజులు కూడా కాకమునుపే పుదుచ్చేరి లో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. పుదువై లో కొంత మంది యువకులు ఓ ఇంటర్ స్టూడెంట్ (17) ని కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసిన అనంతరం ఓ బస్ స్టాండ్ లో వదిలి వెళ్లారు.
ఈ నెల ఒకటో తేదీన ఆమె విల్లియనూర్ బస్ స్టాండ్ లో బస్ కోసం వేచిచూస్తోంది. ఆ సమయంలో ఆమెకు గతంలోనే పరిచయం ఉన్న ఓ బస్ కండక్టర్ ఆమె తల్లికి ఓ రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయని, ఆసుప్రతిలో ఉందని, వెంటనే తీసుకువెళ్తానని చెప్పి తన బస్సులో ఎక్కించుకొని ఓ రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు.
అక్కడ ఆమెఫై మత్తు మందు చల్లి ఆ వ్యక్తితో పాటు మరి కొంత మంది కలిసి ఆమెఫై గ్యాంగ్ రేప్ చేశారు. అయితే, ఆమె తల్లి తండ్రులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ముందుగా పట్టిన్చుకోలేదని సమాచారం. అయితే, ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఆ బస్ కండక్టర్ తో సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు.మూడవ వ్యక్తి కోసం ప్రస్తుతం పోలీసులుగాలిస్తున్నారు. రేప్ సంఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆ ప్రాంతంలో ఆందోళనకు దిగారు.
ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆమె తండ్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.