పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కలుస్తారా?
posted on Apr 14, 2014 @ 12:34PM
పవన్ కళ్యాణ్ కళ్యాణాల హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ప్రేమించి పెళ్ళాడిన నందినికి దూరమైన పవన్ కళ్యాణ్ తనతో ‘బద్రి’లో నటించిన రేణూ దేశాయ్‌కి చేరువయ్యాడు. ఆ తర్వాత నందినికి విడాకులిచ్చేశాడు. రేణూ దేశాయ్‌తో కొంతకాలం సహజీవనం, మరికొంతకాలం వైవాహిక జీవితం గడిపి, ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. కాలక్రమేణా రేణూ దేశాయ్‌తో వైవాహిక జీవితాన్ని ముగించేసి, ‘సెటిల్’ చేసుకున్నాడు.
ఇప్పుడొక విదేశీయురాలిని పెళ్ళాడాడు. ఈ హిస్టరీ ఇలా వుంటే, పవన్ కళ్యాణ్ నుంచి దూరమైపోయి తన స్వస్థలమైన పూణే వెళ్ళిపోయిన రేణు దేశాయ్ ఒక హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తూ బిజీగా వున్నారు. అయితే తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌కి చేరువ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్లో పవన్ కళ్యాణ్ గురించి చేసిన పాజిటివ్ కామెంట్లు దీనికి బలాన్నిస్తున్నాయి. రేణు దేశాయ్ పవన్ గురించి ఫేస్ బుక్‌లో చేసిన కామెంట్లు చాలా ఆసక్తికరంగా వున్నాయి.
పవన్ కళ్యాణ్ చాలా ఉన్నత ఆశయాలున్న వ్యక్తి అట. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదైనా చేయాలని నిరంతరం తపించే వ్యక్తి అట. తమమధ్య అభిప్రాయ భేదాలు వుండటం, వాటివల్ల తాము విడిపోవడం జరిగినప్పటికీ, పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో గౌరవమట. రేణు దేశాయ్ సడన్‌గా ఇలా పబ్లిగ్గా పవన్ కళ్యాణ్‌ని పొగడ్డం చూస్తుంటే వీరిద్దరూ మళ్ళీ చేరువవుతారేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి.