మనకు బిజెపి ప్రధాన శత్రువు
posted on May 18, 2023 @ 11:52AM
యుపిఏ భాగస్వామ్య పార్టీలలో చేరే పార్టీలు, చేరబోయే పార్టీలు కర్ణాటక ఫలితాలను సమర్ధిస్తున్నాయి. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2021 హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కెసీఆర్ బిజెపిని టార్గెట్ గా పెట్టుకున్నారు. సిట్టింగ్ బిఆర్ఎస్ స్థానం బిజెపి చేతిలోకి వెళ్లడాన్నిఅప్పట్నుంచి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలంగాణ భవన్ లో ఎంఎల్ఏ, ఎంఎల్సి, ఎంపీల సమావేశంలో కేసీఆర్ అన్న మాటల ప్రకారం మనకు బిజెపి ప్రధాన శత్రువు అని సంభోధించారు. కర్ణాటకలో బీజెపి పరాజయాన్ని బీఆర్ఎస్ విజయంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బిగ్ విక్టరీ అయినప్పటికీ ఆయన పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. కాకపోతే తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం లేకుండా ఉండాలన్నది కెసీఆర్ అభిమతం. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యుకెలో ఉన్నారు. ఫలితాలు బిజెపికి అనుకూలంగా వచ్చిన్పటికీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ ట్విట్టర్ వేదికగా సందేశం ఇచ్చారు. కర్ణాటక ప్రభావం తెలంగాణలో ఉండదు అని కార్యకర్తలకు మనో ధైర్యాన్నిచ్చింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సీట్లు ఎగరేసుకుపోతుంది అన్న భయం కావొచ్చు కెసీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయలేదు అని కెసీఆర్ సెలవిచ్చారు. కేంద్రంలో యుపిఏ ప్రఢుత్వం ఉన్న సమయాన ప్రత్యేక తెలంగా ణ రాష్ట్ర సాధ్యమయ్యింది. కాబట్టి యుపిఏ ప్రభుత్వాన్ని అంత ఘాటుగా కెసీఆర్ ఆరిపోసుకోవడం లేదు కెసిఆర్.