సంక్షిప్త వార్తలు
posted on Jun 23, 2023 @ 4:33PM
1.రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశాడని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలని నిలదీశారు.
2. పనితీరు మెరుగు పరుచుకోలేని, గ్రాఫ్ ను పెంచుకోలేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేనంటూ ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. 18 మంది ఎమ్మెల్యేల పనితీరు అత్యంత దారుణంగా ఉందని ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా జగన్ చెప్పారు.
3. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎప్పుడో 111 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ షిప్ శకలాలు చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి టైటాన్ కోసం చేసిన అన్వేషణ ఫలించలేదు. వారు క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు.
4. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రధానితో పాటూ ఇతర భారతీయ ప్రముఖులతో కలిపి మొత్తం 400 మంది అతిథులు ఈ విందులో పాలుపంచుకున్నారు.
5. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమాల్లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, ప్రధాని అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయనకు ఉన్న పాపులారిటీపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని వెలువరించింది.
6. జగన్ పాలనలో అడుగడుగునా దౌర్జన్యాలు జరుగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ మాత్రం తాను తీయబోయే సినిమాపై రామ్ గోపాల్ వర్మ తో సమీక్షా సమావేశం పెట్టుకున్నాడని విమర్శించారు.
7. ప్రయాణీకుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు తాంబరం నుంచి సంబల్‌పూర్‌కు గురువారం రాత్రి 10 గంటలకు ప్రత్యేక రైలు నడిపారు. తిరిగి ఇదే రైలు ఈ నెల 24వ తేదీ ఉదయం 5 గంటలకు సంబల్‌పూర్‌లో బయలుదేరి మరునాడు ఉదయం 7 గంటలకు చెన్నై బీచ్ చేరుకుంటుంది.
8. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా కేటీఆర్ భేటీ అవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
9. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాపు నేత ముద్రగడ పద్మనాభం పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. ముద్రగడ ఈరోజు పవన్ కు సవాల్ విసురుతూ మరో ఘాటు లేఖను సంధించారు.
10. శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రాజకీయ లబ్ది కోసమే ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
11. ఆంధ్రప్రదేశ్ లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని వారు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
12. ప్రతి ఒక్కరూ తమ పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించింది.
13. ఈ ఏడాది చివరిలోగా జరగనున్న తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మనం గెలవబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇకపై బీజేపీ ఎక్కడా కనిపించదని ఆయన జోస్యం చెప్పారు.
14. జమ్మూకశ్మీర్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు.
15.అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ప్రధాని గురువారం అమెరికన్ చట్ట సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
16. బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మరోసారి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. పార్టీ పెద్దలు ఈ ఇద్దరినీ ఈ రోజు ఢిల్లీ పిలిపించుకున్నట్టు తెలుస్తోంది.
17. తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
18. పాట్నాలో ఈరోజు జరిగిన విపక్షాల సమావేశంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీ అత్యధిక మెజార్టీతో మరోసారి అధికారంలోకి వస్తారని చెప్పారు.
19.రిలయన్స్ జియో 5జీ ఫోన్ ను తక్కువ ధరలోనే ఈ ఏడాది చివర్లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ఫొటోలు అప్పుడే ఆన్ లైన్ లోకి చేరాయి.
20. మధ్య ప్రదేశ్ లో మనుషులపై దాడులు చేస్తూ రెండు వారాలుగా ముప్పు తిప్పలు పెట్టిన కోతిని అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. డ్రోన్ సాయంతో గాలించి, మత్తు ఇంజెక్షన్ చేసి బోనులో పెట్టారు.