Read more!

లగడపాటికి టిడిపిలోకి ఆహ్వానం

 

 

 

 

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆరాటపడుతున్న విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కావాలంటే తమ పార్టీ లోకి రావచ్చని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆహ్వానం పలికారు.


పాదయాత్రలో బాబును కలిసి కనువిప్పు కలిగిస్తామని లగడపాటి చెప్పడం విడ్డూరమన్నారు. లగడపాటి చీప్ ట్రిక్స్ మానుకోవాలన్నారు. ఆయన నోటికి తాళం ఎలా వేయాలో తమకు తెలుసన్నారు. బాబు పర్యటన ఆపే దమ్ము, ధైర్యం లగడపాటికి ఉందా అని ఆయన ప్రశ్నించారు.



రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆయన కలవాల్సింది తమ పార్టీ అధినేతని కాదని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అన్నారు. బాబు అపాయింట్మెంట్ కావాలంటే లగడపాటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలన్నారు.