పాకిస్థాన్ ను మరోసారి వెనకేసుకొచ్చిన చైనా..పాక్ త్యాగాలను గుర్తించాలి..
posted on Oct 17, 2016 @ 4:57PM
మన పొరుగు దేశమైన పాకిస్థాన్ మనం తిట్టడం కామన్.. దానికి చైనా వెనకేసుకురావడం ఇంకా కామన్. ఇప్పటి వరకూ పలు సందర్భాలల్లో ఇది నిజమని తేలింది. ఇప్పుడు మరోసారి అది నిజం చేసింది చైనా.. గోవాలో బ్రిక్స్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో మోడీ ప్రధాని పాకిస్థాన్ ఉగ్రవాదంపై విమర్శలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి తల్లిలాంటిదని అన్నారు. దీనిపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్.. ఏదో ఒక దేశాన్ని లేదా మతాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తామని.. కౌంటర్ టెర్రరిజంలోనూ చైనా వైఖరి మారలేదని ఆమె స్పష్టంచేశారు. ఏ రూపంలోని ఉగ్రవాదాన్నైనా మేం వ్యతిరేకిస్తాం. అన్ని దేశాల్లో సుస్థిరత, భద్రత కోసం అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయాలి అని చున్యింగ్ అన్నారు. అంతేనా పాకిస్థాన్ చేసిన త్యాగాలను ప్రపంచం గుర్తించాలని నీతులు కూడా బోధిస్తోంది. పాకిస్థాన్‌తో తమది ఏ పరిస్థితుల్లోనూ విడిపోని బంధమని మరోసారి ఆమె తేల్చిచెప్పారు.