ప్రచారం తెలంగాణలో మకాం ఎపిలో
posted on Nov 23, 2023 @ 11:28AM
బిజెపికి స్టార్ క్యాంపెయినర్ల కొరత ఏర్పడింది. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పక్క రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన నటి ఖష్బూ ఇటీవల మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి కేవలం హైదరాబాద్ లో మాత్రమే ప్రచారం చేయడం క్యాడర్ కు తలనొప్పిగా మారింది. బిజెపిలో స్టార్ క్యాంపెయినర్ ప్రధాని మోదీ కావడంతో ఈ మూడు రోజుల ప్రచారం మీద అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణలో ప్రచారానికి ఇంకా వారం రోజులే గడువుండటంతో బీజేపీ అగ్రనాయకుల ప్రచార షెడ్యూల్ సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ని బీజేపీ ప్రకటించింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మొత్తం ఆరు బహిరంగ సభలు, ఒక్క రోడ్ షోలో పాల్గోనున్నారు.
ఎన్నికల ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలు ప్రచారం ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతుంది. ఇప్పటికే పలు ధఫాలుగా రాష్ట్రంలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి తెలంగాణకు రానున్నారు. మూడు పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. కానీ ఈ మూడు రోజులు ప్రధాని ఎపిలో బస చేస్తారని సమాచారం.