Read more!

మమతా బెనర్జీ కి ఎదురు దెబ్బ

 

 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని పడగోడతానని సవాల్ విసిరిన మమతా అవిశ్వాసానికి కావలసిన మద్దతును కూడగట్టలేకపోయారు. అవిశ్వాసానికి మద్దతు లేకపోవడంతో స్పీకర్ తీర్మానాన్నిఅనుమతించలేమని ప్రకటించారు. దాంతో తృణమూల్ సభ్యులు నిరసనకు దిగారు. ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ప్రభుత్వం పార్లమెంట్ విలువలను దిగజార్చిందని ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఆరోపించారు. 184 నిబంధన కింద ఎఫ్డీఐలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.