Read more!

తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదు?: బాబు

 

 

 

ఎవరి మద్ధతు లేకుండానే కేంద్రం అణుఒప్పందం బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర కరెంట్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. చంద్రబాబు ’వస్తున్నా…మీకోసం’ పాదయాత్ర మెదక్ జిల్లాలో కొనసాగుతోంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు ఏవీ కొనుక్కునే పరిస్థితి కనిపంచడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


 

పిల్లా కాంగ్రెసుకు చెందిన పత్రికలో గీత కార్మికులను అవమానించేలా రాతలు వచ్చాయని, బెల్టు షాపులను రద్దు చేస్తానని తాను చెప్పానని, కానీ గీత కార్మికులను కూడా ఆ పత్రిక కలిపిందని చంద్రబాబు మండిపడ్డారు. కల్లుకు, బెల్టు షాపులకు సంబంధం లేదన్నారు. కల్లుని నిషేధిస్తానని తాను చెప్పలేదన్నారు. వైయస్ ఉన్నప్పుడు గీత కార్మికుల పొట్ట కొట్టాడన్నారు. అప్పుడు రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గీత కార్మికులకు లైసెన్సులు ఇస్తామన్నారు.