దారుణం.. ప్రేమకు అంగీకరించలేదని చేతులు నరికి హత్య
posted on May 5, 2016 @ 5:07PM
మహిళలపై తరచూ జరుగుతున్న ఆకృత్యాలు చూస్తూనే ఉన్నాం.. అయితే జార్ఖండ్ లో జరిగిన ఘటన చూస్తే మాత్రం భయపడాల్సిందే. కళాశాల ఎదురుగానే ఓ విద్యార్దినిని దారుణంగా హత్య చేశారు. చేతులు నరికేసి దుండగులు, ఆమె తలపై మోది హత్య చేశారు. వివరాల ప్రకారం జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ లో సోనాలి మర్మ్ అనే వివాహిత మహిళ బీఈడీ చదువుతోంది. అయితే ఆమె ఎప్పటిలాగే కాలేజ్ కి వెళుతుండగా దుండగులు ఆమ చేతులు నరికి, తలపై మోదీ దారుణంగా హత్య చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసకున్నారు.
అయితే ఆమెను ప్రేమిస్తున్నానంటూ సుకేన్ మండల్ అనే వ్యక్తి తరచూ ఆమె వెంట పడుతుండేవాడు. అయితే ఆమెకు పెళ్లైయిన కారణంగా అతని ప్రేమను నిరాకరించింది. దీంతో అతడు ఎప్పటినుండో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. దీంతో అతనే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దుమ్కా ప్రాంతానికి చెందిన నిందితుడు సుకేన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.