కమల్ హాసన్ పై నాకు కక్ష లేదు: జయలలిత

 

 

 

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత "విశ్వరూపం" సినిమా నిషేధాన్ని సమర్ధించుకున్నారు. కమల్ హాసన్ నాకు శత్రువు కాదనీ, నిషేధం వెనుక ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవని చెప్పారు. ఆ సినిమా విడుదల ఆపాలని ముస్లీం సంఘాలు పిర్యాధు మేరకు కొంతకాలం నిషేధం విధించమని చెప్పారు.


చిదంబరం ప్రధాని కావలన్న౦దుకే కమలహాసన్ పై కక్ష సాధిస్తున్నాననడం సరికాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత కరుణానిధి కూడా తామేదో చేసినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. జయ టీవిలో తనకు వాటాలు లేవని, దాని కార్యకలాపాలతో తనకు సంబందం లేదని చెప్పారు.


ముస్లీం సంఘాలు పిర్యాధు పట్టించుకోకుండా చిత్రం విడుదలకు అంగీకరిస్తే, తమిళనాడులో ఉన్న 500 పైగా ఉన్న థియేటర్లకు రక్షణ కల్పించడం కష్టమన్నారు. విశ్వరూపం చిత్రం ప్రశాంతంగా ప్రదర్శించాలంటే 56 వేల మంది పోలీసు బలగాలు అవసరమని చెప్పారు. ముఖ్యమంత్రిగా శాంతిభద్రతలు కాపాడటం తన బాధ్యత అని, అందువల్ల నిషేధం విధించామన్నారు.