జగన్ బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా

 

 

 

 

 

 

 

 

 

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్టాట్యూటరీ బెయిల్ పిటీషన్ ఫై విచారణను రాష్ట్ర హై కోర్టు ఈ నెల 13 కు వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జగన్ ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

 

రెగ్యులర్, స్టాట్యూటరీ బెయిల్ పిటీషన్లు రెండింటి ఫైన ఆ రోజునే కోర్టు వాదనలను వింటుంది.

 

నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి అవ్వని పక్షంలో చట్టబద్దంగా బెయిల్ పొందే అవకాశం ఉంటుందని, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ కోర్టును అభ్యర్ధించారు. తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయిన విషయాన్ని కూడా జగన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జగన్ ఇటీవలే, స్టాట్యూటరీ పిటీషన్ తో పాటు, సాధారణ పిటీషన్ ను కూడా కోర్టు లో దాఖలు చేశారు.